schedule Saturday, September 19, 2026

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది

calendar_today March 15, 2023
person dharshininews
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది - అన్నిరంగాల్లో నారీమణుల సత్తా చాటాలి - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర ఎనలేనిదని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 9వ వార్డ్ సాయిపూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మలు కాలనీకి చెందిన మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం అన్నారు. మహిళలు అందరు అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలు చాటాలని సూచించారు. ముగింపు వేడుకల సందర్బంగా కేక్‌ కట్ చేసి తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురుకు సన్మానాలు కూడ చేశారు.