schedule Sunday, July 05, 2026

రద్దయిన రాజీవ్ స్వగృహా వేలం

calendar_today March 17, 2023
person dharshininews
రద్దయిన రాజీవ్ స్వగృహా వేలం
రద్దయిన రాజీవ్ స్వగృహా వేలం - ప్లాట్ల వేలానికి స్పందన కరువు - కలిసిరాని గజం ధర తగ్గింపు ప్రకటన - ఇద్దరంటే ఇద్దరు రావడంతో వేలం నిలిపివేత - త్వరలోనే మళ్లీ బహిరంగ వేలం ప్రకటన - తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహా ప్లాట్ల వేలం రద్దయ్యింది. బహిరంగా వేలానికి స్పందన లేకపోవడంతో వేలం రద్దు చేసినట్లు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ప్రకటించారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని మనోహా టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహా ప్లాట్లకు శుక్రవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో బహిరంగ వేలం ఏర్పాటు చేశారు. ఇందులో ఎలాంటి సమస్యలు లేని 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం వేస్తున్నట్లు ఇదివరకే జరిగిన ప్రీబిడ్డింగ్ సమావేశంలో తెలిపిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలానికి ఇద్దరు అంటే ఇద్దరు పరుశురాం, శ్రీకాంతత్ అనే కొనుగోలు దారులు మాత్రమే హాజరయ్యారు. ఆ ఇద్దరు కూడ వేరు వేరు ఇండ్లకు డీడీలు సింగిల్ డీడీలు కట్టడడంతో వేలంలో పోటీకి అస్కారం లేకుండా పోయింది. దీంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ అశోక్ కుమార్ ప్రకటించారు. ఈ నివేధికను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి నివేధిక అందిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాలతో మళ్లీ బహిరంగ వేలంకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కలిసిరాని తగ్గింపు ధర ప్రకటన మరోవైపు బహిరంగ వేలానికి ముందు గురువారం ఓపెన్ ప్లాట్లకు సంబంధించి గజం ధర రూ. 10 వేల నుంచి రూ.7500లకు తగ్గించినట్లు కూడ ప్రకటించారు. కాని క్షేత్ర స్థాయిలో ప్రచారం లేకపోవడంతో బహిరంగ వేలానికి స్పందన కరువైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో గజం ధర తగ్గించినా స్పందన కరువైపోయింది.