schedule Sunday, July 05, 2026

కాంగ్రెస్‌ దర్నాను జయప్రదం చేయండి

calendar_today March 19, 2023
person dharshininews
కాంగ్రెస్‌ దర్నాను జయప్రదం చేయండి
కాంగ్రెస్‌ దర్నాను జయప్రదం చేయండి - తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో చేపడుతున్న దర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ కోరారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్ ఆదేశాల మేరకు రేపు సోమవారం ఉదయం 10-30 గంటలకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్న పత్రాలు లీకేజ్, లిక్కర్ కుంభకోణం తదితర సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనానికి నిరసనగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ మహరాజ్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ హాజరవుతున్నారని వెల్లడించారు. కావున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్స్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ దర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.