schedule Sunday, July 05, 2026

డబుల్‌ దరఖాస్తులో దళారులను నమ్మొద్దు

calendar_today March 26, 2023
person dharshininews
డబుల్‌ దరఖాస్తులో దళారులను నమ్మొద్దు
డబుల్‌ దరఖాస్తులో దళారులను నమ్మొద్దు - అర్హులందరు డబులు దరఖాస్తు చేసుకొండి - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దళారులను నమ్మొద్దని, స్వీకరణ కేంద్రాల్లో నేరుగా దరఖాస్తులు చేసుకోవాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు పట్టణానికి సంబంధించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తుందన్నారు. తాండూరు పట్టణంలో సోమవారం నుంచి డబుల్ బెడ్ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.  నిర్ణీత కేంద్రాలలో  కేంద్రాలలో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాస్ ఫోటోలతో దరఖాస్తులను నిర్ణయించిన స్వీకరణ కేంద్రాలలో సమర్పించాలని సూచించారు. ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్ముదని సూచించారు. అర్హులైన పేదలందరు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.