schedule Sunday, July 05, 2026

డబుల్‌లో దగా కావొద్దు..!

calendar_today March 28, 2023
person dharshininews
డబుల్‌లో దగా కావొద్దు..!
డబుల్‌లో దగా కావొద్దు..! - బ్రోకర్‌ గాళ్లను నమ్మకండి - నేరుగా దరఖాస్తులు చేయాలి - బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్ఫూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి: డబ్బులిస్తే డబుల్‌ బెడ్‌ రూం ఇప్పిసాం.. మేమే దరఖాస్తు చేస్తామని చెప్పే బ్రోకర్‌ గాళ్లను నమ్మొద్దని బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పట్టణ వాసులకు సూచించారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తోన్న డబుల్‌ బెడ్‌ రూం దరఖాస్తులలో దళారులు ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకునేందుకు యత్నిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. డబ్బులు ఇస్తే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు వస్తుందని ప్రజలు బ్రమలో ఉండొద్దన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేస్తోందన్నారు. కావున డబ్బులు ఇచ్చి దగా కావొద్దని అన్నారు. ఎవరైనా దరఖాస్తు కోసం లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. లేదా మా బృందానికి సెల్‌: 9949747151, లేదా 9985807124లకు తెలియజేయాలని సూచించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాలలోనే దరఖాస్తులు నేరుగా అందించాలని సూచించారు.