schedule Saturday, July 04, 2026

ఎంసెట్‌కి ఫ్రీ కోచింగ్‌ ఇప్పిస్తాం

calendar_today March 29, 2023
person dharshininews
ఎంసెట్‌కి ఫ్రీ కోచింగ్‌ ఇప్పిస్తాం
ఎంసెట్‌కి ఫ్రీ కోచింగ్‌ ఇప్పిస్తాం - 3 నుంచి తాండూరులో నిర్వహణ - ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని యువతకు స్థానిక ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు శుభవార్త చెప్పారు. వచ్చేనెల 3వ తేది నుంచి తాండూరు పట్టణంలో ఎంసెట్ ఫ్రీ కోచింగ్ శిబిరం నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బుధవారం కార్యాలయంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాలిద్ సైఫ్ ఉల్లా, సభ్యులు మాట్లాడుతూ ఎంసెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీగా కోచింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా ఈ సెంటర్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన అద్యాపకులతో బోధన చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంసెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారాలను సమర్పించి ఏప్రిల్ 2వ తేదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.