schedule Tuesday, September 08, 2026

కంటి వెలుగులో మెరుగైన సేవలందించాలి

calendar_today April 6, 2023
person dharshininews
కంటి వెలుగులో మెరుగైన సేవలందించాలి
కంటి వెలుగులో మెరుగైన సేవలందించాలి - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్‌ - కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: కంటి వెలుగు శిబిరాల్లో పేదలకు మెరైన సేవలను అందించాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం వార్డులోని వేధిక్ విశిష్ట స్కూల్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కంటి సమస్యలతో వైద్యం చేయించుకోలేని పేదలు కంటి వెలుగు శిభిరాలలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి వెలుగు ద్వారా ఉచిత పరీక్షలు చేయించడంతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పేదలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా కంటి వెలుగు శిబిరంలో వైద్యులు, సిబ్బంది పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా. రాజేశ్వరి, సూపర్ వైజర్ అంబిక, ఎఎన్ఎం పార్వతి, ఆప్తమాలజిస్ట్ అరుంధతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.