schedule Sunday, July 05, 2026

నేడే చూండండి..!

calendar_today April 9, 2023
person dharshininews
నేడే చూండండి..!
నేడే చూండండి..! - సాయిపూర్‌లో బలగం చిత్ర ప్రదర్శన - ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ నాయకుడు తాండూరు, దర్శిని ప్రతినిధి: రండి సినిమా చూద్దాం అంటూ తాండూరు బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు ఆహ్వానిస్తున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో అసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ సంప్రదాయాలు, కుటుంబ బంధాలపై తెరకెక్కించిన బలగం సినిమా ఎంతో ఆదరణ పొందింది. ఈ చిత్రంలో అనుబంధాలు సన్నివేశాలు అందరిని కంటతడి పెట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన తరువాత గ్రామ గ్రామాన, పట్టణాల్లో చిత్ర ప్రదర్శన జరుగుతోంది. కొంత మంది నాయకులు, పెద్దలు ప్రత్యేకంగా షోలు వేయిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు బలగం చిత్ర ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. సాయిపూర్‌లోని హనుమాన్ మందిరం వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు చిత్ర ప్రదర్శన ఉచితంగా ఉంటుందని సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం కూడ చేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ అంతరించి పోతున్న మన సంప్రదాయాలు, కనుమరుగు అవుతున్న కుటుంబ గౌరవాలను అందరికి తెలిసేలా చూపించిన బలగం సినిమా అందరు చూడాలనే ఉద్దేశంతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సాయిపూర్‌తో పాటు పట్టణ వాసులు హాజరైన చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు.