schedule Sunday, July 05, 2026

అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం

calendar_today April 12, 2023
person dharshininews
అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం
అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం - గజమాలతో సత్కరించిన బీఆర్ఎస్ యువనాయకులు - శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల వారసుడు పట్నం రినీష్‌ రెడ్డి జన్మదినం అట్టహాసంగా జరిగింది. బుధవారం హైదరాబాద్‌లో ఈ వేడుకలు జరిగాయి. తాండూరుకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు బిర్కడ్‌ రఘు ఆధ్వర్యంలో రినీష్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రినీష్‌ రెడ్డికి నిలువెత్తు గజమాలను వేసి.. పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరుకు చెందిన బీఆర్ఎస్ యువనాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి రినీష్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిర్కడ్‌ రఘు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిల వారుసుడుగా.. నాయకుడుగా రినీష్‌ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో యువకులు కలిసి నడుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దు పంతులు, రాజు, పునీత్ తదితరులు పాల్గొన్నారు.