schedule Saturday, July 04, 2026

చైల్డ్ పోర్న్ చూసినా.. సెర్చ్ చేసినా జైలుకే..!

calendar_today April 12, 2023
person dharshininews
చైల్డ్ పోర్న్ చూసినా.. సెర్చ్ చేసినా జైలుకే..!
చైల్డ్ పోర్న్ చూసినా.. సెర్చ్ చేసినా జైలుకే..! - అలాంటి సంఘటనలు ఎదరైతే ఫిర్యాదు చేయండి - వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఇంటర్నెట్, లేదా సోషల్ మీడియాలో ఎవరైనా పిల్లల అశ్లీల (చైల్డ్ పోర్న్) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్ చూస్తే జైలుకెళ్లడం ఖాయమని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు చైల్డ్ పోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్న వారిని గుర్తించి వారి పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది గుర్తుచేశారు. బాలల లైంగిక వేధింపు అంశాలను వీడియోలను, ఫొటోలను సర్క్యులేట్ చేసినా.. ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిఘా పెట్టడం జరుగుతుంది తెలిపారు. ఇప్పటికే ఎన్సీఆర్బీనుంచి వచ్చిన ఫిర్యాదు పైన పిల్లల అశ్లీల (చైల్డ్ పోర్న్) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్ చూసిన వారిపైన కేసు నమోదు చేసి, కోర్ట్ కు పంపడం జరిగింది తెలిపారు. కావున ఎవరైనా ఎవరూ చూడటం లేదని దొంగచాటుగా చైల్డ్ పోర్న్ వీడియోలు చూడడం, చిన్న పిల్లల అసభ్యకరమైన ఫోటోలో సెల్ ఫోన్ ఉంచుకోవడం, పిల్లలను అసభ్యకరంగా ఫోటోలు తీయడం నేరమన్నారు. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో పదే పదే చైల్డ్ అబ్యూజ్ కంటెంట్‌ను సెర్చ్ చేస్తే జైలు శిక్ష తప్పదన్నారు. ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నవారు ఎవరైనా ఇకనైనా ఆ వక్రబుద్ధిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చైల్డ్ పోర్నోగ్రఫీని దొంగతనంగా చూస్తున్నారు అని ఎవరిపైనా అయిన అనుమానం వచ్చిన, చిన్న పిల్లల అసభ్య ఫోటోలు తీస్తున్నారు అని అనుమానం వచ్చిన వెంటనే తమ పరిధి లోని పోలీస్ అధికారులకు లేదా డయల్‌ 100 కు గాని తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను, చిరునామాను గోప్యంగా ఉంచడం జరుగుతుంది స్పష్టం చేశారు.