schedule Monday, September 21, 2026

మహనీయుడు అంబేద్కర్

calendar_today April 14, 2023
person dharshininews
మహనీయుడు అంబేద్కర్

మహనీయుడు అంబేద్కర్ - అయన ఆశయ సాధనకు కృషి చేయాలి - కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహారాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజంలో అందరికీ జీవించే హక్కు కల్పించిన మహనీయుడు డా. బీఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ టిపిసిసి ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ హాజరై నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మహారాజ్ తో పాటు పలువురు మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జడ్పిటిసి ధారాసింగ్, కాంగ్రెస్ పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్, సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్, సయ్యద్ షుకూర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడుబంటు వేణుగోపాల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.