schedule Monday, September 21, 2026

భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్

calendar_today April 15, 2023
person dharshininews
భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్
భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్ - కుటుంబ సమేతంగా స్వామికి పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరున్ని స్థానిక మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ దర్శించుకున్నారు. జాతర ఉత్సవాలను పురసర్కరించుకుని శనివారం కుటుంబ సమేతంగా దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన భద్రేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు, పూజారులు కమీషనర్‌కు స్వాగతం తెలిపి సేవలు అందించారు. ఈ సందర్భంగా కమీషనర్ శంకర్ సింగ్ మాట్లాడుతూ తాండూరు భద్రేశ్వరుని మహిమను తెలుసుకోవడం జరిగిందన్నారు. తాండూరు ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండేలా, పట్టణ అభివృద్ధి జరిగేలా చూడాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.