schedule Sunday, July 05, 2026

ఇఫ్తార్ విందుకు తరలిరండి

calendar_today April 15, 2023
person dharshininews
ఇఫ్తార్ విందుకు తరలిరండి
ఇఫ్తార్ విందుకు తరలిరండి - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు - బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) శనివారం ఓ ప్రటకలో తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ఇప్తార్ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు తాండూరు ముస్లిం సోదరులు భారీగా తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.