ఘనంగా పటేల్ కిరణ్ బర్త్ డే
April 17, 2023
dharshininews
ఘనంగా పటేల్ కిరణ్ బర్త్ డే
- శుభాకాంక్షలు తెలిపిన నేతలు, అభిమానులు
- కేక్ కట్ చేయించిన సన్నిహితులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కోశాధికారి, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం కుటుంబీకులు, సన్నిహితుల ఆధ్వర్యంలో పటేల్ కిరణ్ జన్మదినాన్ని జరుపుకున్నారు. పటేల్ కిరణ్‌కు తండ్రి వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్, కల్వ రాధాకృష్ణ, వ్యాపారులు, సమాజం సభ్యులు తదితరులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పటేల్ కిరణ్‌ను సన్మానించి ఆయన చేత కేక్ కట్ చేయించారు. కుటుంబ సభ్యులు, నేతలు, అభిమానులు పటేల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలను వెల్లువలా తెలిపారు.