schedule Tuesday, September 22, 2026

అంబేద్కర్‌ భవన్‌కు మహర్థశ

calendar_today April 20, 2023
person dharshininews
అంబేద్కర్‌ భవన్‌కు మహర్థశ
అంబేద్కర్‌ భవన్‌కు మహర్థశ - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో బోరు పనులు - బీఆర్ఎస్‌ ఎస్సీసెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్‌కు మహర్థశ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హన్మంతు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో అంబేద్కర్ భవన్‌ వద్ద బోరు మోటారు పనులు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా నీరటి హన్మంతు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషితో కొన్ని రోజుల క్రితం తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో అంబేద్కర్ భవన్‌ భూమి పూజ నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు. భవనం కోసం రూ. 1కోటి మంజూరు చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయడంలో భాగంగా గురువారం అంబేద్కర్ భవన్‌ వద్ద బోరు మోటారు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. దళిత సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.