చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి
April 20, 2023
dharshininews
చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
- తాండూరు ఆర్యవైశ్యలో ప్రదర్శన మేళా
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేనేత హస్తకళలను అందరు ప్రోత్సహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సస్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత హస్త కళలు పురాతనమైనవన్నారు. విభిన్న రూపాల్లో సంప్రదాయాలను దాటే చేనేత హస్తకళలను అందరు. ప్రోత్సహించి ఆదరించాలన్నారు. అనంతరం నిర్వహకులు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ను సన్మానించారు. అంతకుముందు ప్రదర్శనలో ఉన్న వివిధ ప్రదర్శనలు, వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయరవి తదితరులు పాల్గొన్నారు.