schedule Tuesday, September 22, 2026

అంగన్‌వాడి నిర్మాణ స్థలాన్ని మార్చండి

calendar_today April 20, 2023
person dharshininews
అంగన్‌వాడి నిర్మాణ స్థలాన్ని మార్చండి
అంగన్‌వాడి నిర్మాణ స్థలాన్ని మార్చండి - అభ్యంతరం తెలిపిన కోఆప్షన్ సభ్యురాలు బిడ్కర్ ఉశ - మున్సిపల్ కమీషనర్‌కు అభ్యంతర ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి గాంధీనగర్‌లో అంగన్‌వాడి వాడీ భవన నిర్మాణ స్థలాన్ని మార్చాలని బీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యురాలు, మాజీ కౌన్సిలర్ బిడ్కర్ ఉశ, బీఆర్ఎఎస్వీ రాష్ట్ర నాయకులు బిడ్కర్ రఘు డిమాండ్ చేశారు. గురువారం తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ నేను కలిసి అభ్యంతర ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా కోఅప్షన్ సభ్యురాలు బిడ్కర్ ఉశ మాట్లాడుతూ తాను గతంలో కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో గాంధీనగర్ లోని కమ్యూనిటి హాల్ సమీపంలోని స్థలంలో మిని ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు తీర్మానం చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అదే స్థలంలో అంగన్ వాడి భవనాన్ని నిర్మించడం తగదన్నారు. బిడ్కర్ రఘు మాట్లాడుతూ మినీ ఫంక్షన్ హాల్ కోసం చేసిన కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా అంగన్ వాడి భవనం నిర్మించడం కరెక్ట్ కాదన్నారు. అంగన్ వాడీ భవన నిర్మాణానికి వ్యతిరేకం కాదని, గాంధీనగర్ లో ఉన్న మరో ప్రభుత్వ స్థలంలో అంగన్ వాడి భవనాన్ని నిర్మించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కావున గతంలో తీర్మానించిన మిని ఫంక్షన్ హాల్ స్థలంలో కాకుండా వేరే చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు.