schedule Sunday, July 05, 2026

రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

calendar_today April 21, 2023
person dharshininews
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ - ఈద్గా మైదానంలో ఏర్పాట్ల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి: ముస్లిం సోదరుల రంజాన్ పండగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషణర్ శంకర్ సింగ్ అన్నారు. శనివారం రంజాన్ పండగను పురస్కరించుకుని శుక్రవారం పండగ ఏర్పాట్లను కమీషనర్ పరీశించారు. ఇందులో భాగంగా పట్టణ శివారులోని ఈద్గా మైదానాన్ని సందర్శించారు. ఈద్గా మైదానంలో ముస్లి సోదరుల ప్రార్థనలు, పండగ ఏర్పాట్లను సమీక్షించారు. మైదానం వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలీసు అధికారులతో ఏర్పాట్లను సమన్వయం చేసుకున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం ఇతర మసీదులు, ప్రార్థనా మందిరాలలో తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ శంకర్ సింగ్ మాట్లాడుతూ రంజాన్ పండగకు మున్సిపల్ తరుపున పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు, సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. కమీషనర్‌ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.