schedule Monday, September 21, 2026

ఎన్పీఎస్ రద్దు చేయాలి

calendar_today April 21, 2023
person dharshininews
ఎన్పీఎస్ రద్దు చేయాలి
ఎన్పీఎస్ రద్దు చేయాలి - రైల్వే మజ్దూర్ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్పీఎస్‌ ఫించన్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానాన్నే అమలు చేయాలని తాండూరు దక్షణ మద్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రం ఎన్పీఎస్ విధానానికి వ్యతిరేకంగా మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యూనియన్ నాయకులు, కార్మికులు ఎన్పీఎస్‌ రద్దుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. కొత్త ఫించన్ విధానంతో కార్మికులకు నష్టం జరుగుతోందన్నారు. ఎన్పీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ పీ. కాళేశ్వర్, చైర్మన్ జీ. దేవేందర్, కార్మికులు అశోక్ గౌడ్, దేశాజ్, రిచర్డ్సన్, ప్రకాష్, వెంకటేష్, శ్రీను, జయరాజ్, లక్ష్మణ్, కామకృష్ణ తదితరులు పాల్గొన్నారు