schedule Monday, September 21, 2026

ఈద్ ముభారక్..!

calendar_today April 21, 2023
person dharshininews
ఈద్ ముభారక్..!
ఈద్ ముభారక్..! - రంజాన్ సుఖ సంతోషాలను నింపాలి - శుభాకాంక్షలు చెప్పిన కమీషనర్ శంకర్‌ సింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ముస్లిం సోదరుల పవిత్రి పండగ రంజాన్‌ను పురస్కరించుకుని తాండూరు మున్సిపల్ కమీషనర్‌ శంకర్‌ సింగ్ పట్టణ వాసులకు ఈద్‌ ముభారక్ తెలిపారు. రంజాన్‌ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, దీని వల్ల అన్ని వర్గాల్లో ఐకమత్యం కూడ పెంపొందుతున్నారు. ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించార. రంజాన్ పండుగ ప్రజ‌ల‌ జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాల‌ని అభిల‌షించారు. మరోవైపు శనివారం రంజాన్ పండగ సందర్భంగా ఈద్గా మైదానంతో పాటు మసీదు, ప్రార్థనా మందిరాలలో మున్సిపల్‌ నుంచి తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు.