schedule Monday, September 21, 2026

రాఘవేంద్రుని సన్నిధిలో బీఆర్ఎస్ నాయకులు

calendar_today April 30, 2023
person dharshininews
రాఘవేంద్రుని సన్నిధిలో బీఆర్ఎస్ నాయకులు
రాఘవేంద్రుని సన్నిధిలో బీఆర్ఎస్ నాయకులు - మంత్రాలయంలో స్వామి దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి సన్నిధిలో తాండూరు బీఆర్ఎస్ నాయకులు తరించారు. ఆదివారం బీఆర్ఎస్ తాండూరు ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు నీరటి హన్మంతు, యూత్ పట్టణ మాజీ అధ్యక్షులు నరుకుల నరేష్, యువనాయకులు ఎర్రం శ్రీధర్ లు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా మారాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని అకాంక్షించారు.