schedule Monday, September 21, 2026

జిల్లా భరోసా కేంద్రంలో ఉద్యోగాలు

calendar_today May 3, 2023
person dharshininews
జిల్లా భరోసా కేంద్రంలో ఉద్యోగాలు
జిల్లా భరోసా కేంద్రంలో ఉద్యోగాలు - ఖాళీల భర్తికి దరఖాస్తుల ఆహ్వానం - ప్రకటన జారీ చేసిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా కేంద్రం జిల్లా పోలీస్ కార్యలయంలోని భరోసా సెంటర్‌లో మహిళ ఉద్యోగాల ఖాళీ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటన జారీ చేశారు. భరోసా కేంద్రంలో కాంట్రాక్చువల్ పద్ధతిపై పని చేసేందుకు రెండు మహిళ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. సెంటర్ కోఆర్డీనేటర్ కమ్ ఫిజియాలిస్టు, సహాయకుల పోస్టులను భర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఫిజియాలిస్టుకు పోస్టుకు 35 నుంచి 45 ఏండ్ల వయస్సు ఉండాలని, ఎంఎస్, ఎమ్మెస్సీ, ఫిజియాలజీతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న వాళ్లు అర్హులని తెలిపారు. అదేవిధంగా సహాయకుల పోస్టుకు 25 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉండాలని, ఎంఎస్‌డబ్ల్యూ(మాస్టర్‌ ఆఫ్‌ సోషల్ వర్క్‌)లో రెండేళ్ల అనుభవం ఉండాలన్నారు. అర్హత గల ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 15వ తేది సాయంత్రం 5 గంటలలోపు జిల్లా పోలీస్ కార్యలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.