schedule Sunday, September 06, 2026

మామిడి పండ్ల పెట్టెలో రూ.కోటి

calendar_today May 4, 2023
person dharshininews
మామిడి పండ్ల పెట్టెలో రూ.కోటి
మామిడి పండ్ల పెట్టెలో రూ.కోటి - కర్ణాటక ఎన్నికల తనిఖీలో వెలుగు - చెట్టుకు డబ్బులు దాచిన ఇంట్లోనే ఘటన దర్శిని డెస్క్‌: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చెట్టుకు డబ్బుల మూట దాచిన విచిత్ర సంఘటన జరిగిన ఇంట్లోనే మరో సంచలన ఘటన జరిగింది. ఇంట్లో మామిడి పండ్లను దాచే పెట్టెలో ఉంచిన రూ. కోటిని అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మైసూర్‌లోని పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ రాయ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అతని సోదరుడు సుబ్రమణ్య రాయ్‌ ఇంట్లోనే ఎన్నికల కమీషన్, ఐటీ అధికారులు దాడులు చేశారు. సుబ్రమణ్య రాయ్ ఇంట్లో దాడులకు వెళ్లిన అధికారులకు ఇంట్లో ఉన్న గుబురుగా ఉన్న ఓ చెట్టు పైన లోపల కోటిరూపాయల నగదు గుర్తించిన సంఘటన తెలిసిందే. అదే ఇంట్లో సుబ్రమణ్య రాయ్ ఇంట్లో మామిడి పండ్లను దాచే అట్ట పెట్టెలో దాచిన కోటిని కూడ గుర్తించారు. పైకి మామిడి పండ్లను ఉంచి లోపల నోట్ల కట్టలను దాచినట్లు తనిఖీలో వెలుగులోకి వచ్చింది. చెట్టుకు దాచిన డబ్బులు దొరికిన ఇంట్లో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కర్నాటకలో ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంచిన ఉదంతాలు కూడా వెలుగులోకి రావడంతో పాటు అధికారుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. నేతల ఇండ్లలో దొరికే డబ్బు జప్తు కొనసాగుతోంది. చెట్టులో దాచిన డబ్బు దొరికింది ఇలా.. https://twitter.com/i/status/1653665057358872578