schedule Saturday, July 04, 2026

రానున్న 3గంటల్లో వాన గండం

calendar_today May 6, 2023
person dharshininews
రానున్న 3గంటల్లో వాన గండం
రానున్న 3గంటల్లో వాన గండం - తెలంగాణలో మోస్తారు వర్షాలు, ఈదురు గాలులు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతిని: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 గంటల్లో వానగండం పొంచి ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణపై ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ప్రారంభమైందని తెలిపారు. దీంతో తెలంగాణలో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఇది కూడా చదవండి.. పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి - ఉత్సహాంగా శాలివాహన విద్యార్థుల వీడ్కోలు సమావేశం - ఆడిపాడిన కళాశాల విద్యార్థులు https://dharshininews.com/16935 పట్నం వారి పెళ్లి సందడి..! - వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం - కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ https://dharshininews.com/16923