schedule Saturday, July 04, 2026

రేపు ఇంటర్‌ ఫలితాలు..!

calendar_today May 8, 2023
person dharshininews
రేపు ఇంటర్‌ ఫలితాలు..!
రేపు ఇంటర్‌ ఫలితాలు..! - విడుదలకు టైం ఫిక్స్‌ - ఫలితాలు ఎలా చూసకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారయ్యింది. రేపు ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమైన కారణంతో రిజల్ట్స్‌ను రేపే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లు https://tsbie.cgg.gov.in/ ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు. ఇవి కూడా చదవండి.. పైలెట్ పెద్ద మనసు..! - మైనార్టీల కోసం రూ. 7.31 కోట్లు కేటాయింపు - నిధుల మంజూరు ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - కృతజ్ఞతలు తెలిపిన అఫ్పూ(నయూం) https://dharshininews.com/16983