schedule Saturday, July 04, 2026

పంచాయతీ కార్యదర్శులకు డెడ్‌లైన్‌..!

calendar_today May 8, 2023
person dharshininews
పంచాయతీ కార్యదర్శులకు డెడ్‌లైన్‌..!
పంచాయతీ కార్యదర్శులకు డెడ్‌లైన్‌..! - సమ్మె విరమించాలని సోకాజ్ నోటీసులు - విధుల్లో చేరకుంటే ఎలాంటి చర్యలు ఉంటాయంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సమ్మె విరమించి విధుల్లో చేరాలని షోకాజ్ నోటీసులు అందించింది. రేపు మంగళవారం సాయంత్రం లోపు విధుల్లో చేరకుండా చర్యలు ఉంటాయని డెడ్‌లైన్ ప్రకటించింది. నాలుగేళ్ల శిక్షణ కాలం పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామి ఇచ్చిందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇచ్చిన హామి మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యప్తంగా సమ్మెకు దిగారు. గత 11రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. దీంతో గ్రామాల్లోని పంచాయతీలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై సర్కారు సీరియస్‌ అయ్యింది.    (ఇంకా వుంది....) ఈ క్రమంలో ఆదివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యదర్శులతో చర్చలు జరిపారు. విధుల్లో చేరకపోతే.. తదుపరి పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమ్మెలో పాల్గొంటున్న పంచాయతీ సెక్రెటరీలకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా.. సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. అయితే రేపు (మంగళవారం) సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని, విధుల్లో చేరకుంటే జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీలను శాశ్వతంగా తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా చదవండి.. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ విడ్డూరం - 57 ఏండ్లలో యువతను మోసం చేసింది కాంగ్రెస్సే - హస్తం పార్టీని ఎవ్వరు నమ్మేస్థితి లేదు - బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పాలనో ఉద్యోగవకాశాలు - వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ https://dharshininews.com/17008