schedule Saturday, July 04, 2026

హైఓల్టేజీ తంటా..!

calendar_today May 9, 2023
person dharshininews
హైఓల్టేజీ తంటా..!
హైఓల్టేజీ తంటా..! - 50 ఇండ్లలో కాలిపోయిన గృహోపకరణాలు - తాండూరు పట్టణంలో సంఘటన - విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమన్న బాధితులు తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యుత్ సరఫరాలో తలెత్తిన హై ఓల్టేజీ ఇబ్బంది గృహ వినియోగదారులకు తంటాలు తెచ్చిపెట్టింది. దాదాపు 50 ఇండ్లల్లో హై ఓల్టేజీతో లక్షల విలువైన గృహోపకరణాలు కాలిపోయాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన కథనం మేరకు.... పట్టణంలోని పాండు రంగ దేవాలయ సమీపంలో శాంతప్ప కాలనీ ఉంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్‌ ఫార్మర్‌ ద్వారా స్థానికులు హై ఓల్టేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. సోమవారం రాత్రి విద్యుత్ సరఫరాలో హై ఓల్టేజ్ రావడంతో సుమారు 50 ఇళ్లలో లక్షల విలువైన టీవీ, ఫ్రిజ్జ్, వాషింగ్‌ మిషన్, ఏయిర్ కండిషనర్, కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. (ఇంకా వుంది...) విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నష్టం జరిగిందని స్థానికులు విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు. ట్రాన్స్‌ ఫార్మర్ నుంచి హై ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం విషయం తెలుసుకుని పరిశీలించేందుకు వచ్చిన విద్యుత్ అధికారులను స్థానికులు నిలదీశారు. సమస్యపై ప్రాంత లైన్‌ మెన్‌కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ఏఈ స్పందిస్తూ లైన్‌ మెన్ వ్యక్తిగత కారణాల వల్ల విధుల్లోకి రాలేకపోయారని బదులిస్తూనే హైఓల్టేజీ సమస్య పరిష్కారానికి తమ వద్ద సమర్థవంతై వసతులు లేవని చెప్పడం గమనార్హం. హైఓల్టేజీ సమస్యతో కలిగిన నష్టానికి విద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి.. గర్భిణీలకు రూ. 5వేలు..! - ప్రోత్సహాం అందిస్తోన్న కేంద్రం - ఎలా ఉపయోగించుకోవాలంటే..? https://dharshininews.com/17020