schedule Saturday, July 04, 2026

సిద్దార్థకు ర్యాంకుల పంట

calendar_today May 9, 2023
person dharshininews
సిద్దార్థకు ర్యాంకుల పంట
సిద్దార్థకు ర్యాంకుల పంట - జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫలితాలు - సత్తాచాటిన కాలేజీ విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తాండూరు సిద్దార్థ జూనియర్ కళాశాలకు ర్యాంకుల పంట పండింది. కళాశాలకు చెందిన విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపల్ నరేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం విడుదలైన ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల నేపథ్యంలో వివరాలను వెల్లడించారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీ లో కె శ్రావణి 470కి గాను 464 సాధించి టాపర్‌గా నిలిచింది. బైపీసీలో 440 కి గాని హారతి 435 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా సీఈసీ లో 500 మార్కులకు గాను 489 అల్మాస్ నస్రిమ్, ఎంఈసిలో జోయా ఖానమ్ 500 మార్కులకు గాను 453 మార్కుల సాధించారు. సెకండ్ ఇయర్‌ ఎంపీసీలో స్నేహలత 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర సాయిలో టాపర్‌గా నిలిచింది. బైపిసి లో 992 మార్కులు హర్షిత టాపర్ గా నిలవగా సీసీలో 1000 మార్కులకు గాను శ్రీ చందన 984 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఎంఈసిలో వేయి మార్కులకు గాను 971 మార్కులు శాండల్ కిరణ్ సాధించి టాపర్‌గా నిలిచింది. కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాలలో అత్యధికంగా మార్కులు సాధించడమే కాకుండా జిల్లా, రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలవడం పట్ల ప్రిన్సిపాల్ నరేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి.... హైఓల్టేజీ తంటా..! - 50 ఇండ్లలో కాలిపోయిన గృహోపకరణాలు - తాండూరు పట్టణంలో సంఘటన - విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమన్న బాధితులు https://dharshininews.com/17023