schedule Tuesday, September 22, 2026

శభాష్‌ వర్షిత రెడ్డి..!

calendar_today May 10, 2023
person dharshininews
శభాష్‌ వర్షిత రెడ్డి..!
శభాష్‌ వర్షిత రెడ్డి..! - పదిలో తాండూరు మండల టాపర్‌ - ప్రభుత్వ పాఠశాల నుంచి 9.5 జీపీఏ - అక్కకు కూడా 8.3 జీపీఏ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన పదో తరగతిని విద్యార్థిని వర్షిత రెడ్డి శభాష్‌ అనిపించుకుంది. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచింది. చెంగోల్ గ్రామానికి చెందిన అంజిల్ రెడ్డి, సంధ్యారాణిల కవల కూతుళ్లలో పెద్ద కూతురు హర్షిత, చిన్న కూతురు వర్షితలు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. తండ్రి అంజిలప్ప ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తుండగా తల్లి గృహిణిగా ఉంది. అయితే ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలు రాసిన వర్షిత, హర్షితలు ఫలితాల్లో సత్తా చాటారు. చిన్న కూతురు వర్షిత రెడ్డికి 9.5 జీపీఏతో తాండూరు మండల టాపర్‌గా నిలిచింది. పెద్ద కూతురు హర్షిత కూడా 8.3 జీపీఏ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని వర్షిత రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో ఈ ఘనతను సాధించడం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి... ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..! - ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు - కేరళలో చోటు చేసుకున్న దారుణం - సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్ - తీవ్ర సంచలనమైన ఘటన https://dharshininews.com/17082