schedule Tuesday, September 22, 2026

వేధిక్‌ విశిష్ట విక్టరీ..!

calendar_today May 10, 2023
person dharshininews
వేధిక్‌ విశిష్ట విక్టరీ..!
వేధిక్‌ విశిష్ట విక్టరీ..! - టెన్త్ రిజల్ట్‌లో సైలెంట్ ప్రభంజనం - స్కూల్‌ విద్యార్థికి 9.8 జీపీఏ - ఉత్తమ ఫలితాలు సాధించిన మిగతా విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం డీసీఎంఎస్ ప్రాంగణంలో కొనసాగుతున్న ది వేధిక్ విశిష్ట స్కూల్ విక్టరీ విజయాన్ని సొంతం చేసుకుంది. టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్‌లో సైలెంట్‌గా ప్రభంజనం సృష్టించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలకు చెందిన బీ. వరుణ్‌ 9.8 జీపీఏ, చెన్నకేశవ్‌ రెడ్డి 9.5 జీపీఏ, ఆర్తీ 9.0 జీపీఏ, సౌమ్య 9.0 జీపీఏ, శ్రీలత 8.8 జీపీఏ, రిషిక 8.7 జీపీఏ, నందిని 8.7 జీపీఏ, ఇర్ఫాన్ 8.7 జీపీఏ, ఇందుప్రియ 8.5 జీపీఏ, అక్షయ 8.3 జీపీఏ, నిఖిల 8.3 జీపీఏలు సాధించారు. వీరితో పాటు పాఠశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడ ఉత్తమ ఫలితాలను సాధించారు. పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటడంపై ప్రిన్సిపల్ నాగభూషణం, కరస్పాండెంట్ సుహాస్, డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి, మంజుల, రాములు, మేనేజ్ మెంట్ సభ్యులు వారిని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు వేధిక్‌ విశిష్ట స్కూల్ ద్వారా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి... ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..! - ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు - కేరళలో చోటు చేసుకున్న దారుణం - సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్ - తీవ్ర సంచలనమైన ఘటన https://dharshininews.com/17082