schedule Tuesday, September 22, 2026

ఫలితాల పరంపర కొనసాగాలి

calendar_today May 13, 2023
person dharshininews
ఫలితాల పరంపర కొనసాగాలి
ఫలితాల పరంపర కొనసాగాలి - టెన్త్, ఇంటర్ విద్యార్థులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - ఉత్తీర్ణత విద్యార్థులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పరంపరంను కొనసాగించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. పలువురు విద్యార్థులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే పరంపరను కొనసాగించాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించిన అద్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలిపారు. విద్యారంగంలో ఉన్నతంగా రాణించి లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, కౌన్సిలర్ విజయాదేవి, బీఆర్ఎస్ కేవి నాయకులు విజయ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144