schedule Saturday, July 04, 2026

వేపాకుతో రోగాల దిగులు దూరం

calendar_today May 15, 2023
person dharshininews
వేపాకుతో రోగాల దిగులు దూరం
వేపాకుతో రోగాల దిగులు దూరం - ఆకులో అద్భుతమైన ఔషధ గుణాలు - తెలుసుకుని పాటిస్తే మేలు దర్శిని డెస్క్: వేపాకు శరీర ఆరోగ్యానికి ఎంత ఉపయోగ పడుతుందో కొందరికే తెలుసు. మనలో ఇంకా చాలా మందికి వేపాకు ప్రయోజనాలు తెలియదు. వేపాకులో ఉన్న అబద్భుతమైన ఔషద గుణాలతో రోగాల నుంచి వచ్చే దిగులును దూరం చేసుకోవచ్చు. వేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని మొటిమలు, దద్దుర్ల నుంచి కాపాడతాయి. అలాగే ఈ ప్యాక్‌లోని శనగపిండి ముఖంపై ఆయిలీనెస్‌ను తగ్గిస్తుంది. మంచి క్లీనింగ్ ఏజెంట్‌గానూ శనగపిండి తోడ్పడుతుంది. రోజూ కాలుష్యంలో తిరిగేవారు ఈ ప్యాక్‌ను రోజు విడిచి రోజు వేసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధులు దరి చేరవు. వేప ఆకుల్లో ఉండే క్రిమినాశక గుణాలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతాయి. వేపాకు రసంలోని గుణాలు మధుమేహం, అన్ని క్యాన్సర్లను నివారించడంతో పాటు అనేక ఇతర వ్యాధులను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ప్రతి రోజు వేల ఆకులను తీసుకుంటే అదుపులో ఉంచుతుంది. ఈ ఆకుల్లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. నిత్యం వేప ఆకులను తింటే మధుమేహం రాకుండా ఉంటుంది. నోటిలో చాలా సూక్ష్మక్రిములు నివసిస్తాయి. వేపాకుతో శుభ్రం చేసుకుంటే ఇది వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా గడుస్తున్న కొద్దీ క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. వేప ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి. అంతే కాదు ఈ ఆకు శరీరంలోని మృతకణాలను కూడా తొలగించగలదు. అనియంత్రిత, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలా మందికి అల్సర్ వస్తుంది. ప్రాథమికంగా ఈ వ్యాధి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా దాడి వల్ల వస్తుంది. వేప ఆకులు ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. వేప ఆకులు మొటిమలు, చుండ్రుకు ఉత్తమ నివారణ. ఈ ఆకును మొటిమల మీద రాస్తే ఈ సమస్య తొలగిపోతుంది. అదే విధంగా తలకు రాసుకుంటే చుండ్రు సమస్య నుంచి ప్రయోజనం పొందుతారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144