schedule Saturday, July 04, 2026

ఉత్సహంగా రీయూనియన్ సెలబ్రేషన్స్

calendar_today May 20, 2023
person dharshininews
ఉత్సహంగా రీయూనియన్ సెలబ్రేషన్స్
ఉత్సహంగా రీయూనియన్ సెలబ్రేషన్స్ -న్యూ నలంద హైస్కూల్ పూర్వ విద్యార్థుల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం న్యూనలంద హైస్కూల్కు చెందిన 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్కూల్ రీయూనియన్ సెలబ్రేషన్స్ ఉత్సహాంగా జరుపుకున్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్‌లో పాఠశాల పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 20 ఏండ్ల తరువాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకుని అపూర్వ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మమైరిచి పోయారు. అదేవిధంగా అప్పట్లో బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా న్యూ వలంద హై స్కూల్ ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగినట్లు ఉండాలన్నారు. స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉండడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, వెంకటయ్య, శ్రీధర్, కిషప్పు, హరిష్, కృష్ణ, రెడ్డి, అనంతయ్య, రాములు, నాగభూషణం, రాధిక, పద్మావతి, సరిత, పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..! - వ్యర్థాలు కూడా బయటకు - ఆరేళ్ల పాపకు వింత వ్యాధి - కలకలం రేపుతున్న ఘటన https://dharshininews.com/17255 chaithany collage