schedule Saturday, July 04, 2026

టెన్త్ ఫేయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌

calendar_today May 30, 2023
person dharshininews
టెన్త్ ఫేయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌
టెన్త్ ఫేయిల్ అయిన విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ - మ్యాథ్స్ సబ్జెక్టులో ఫ్రీ ట్యూషన్ - ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : టెన్త్ ఫేయిల్‌ అయిన విద్యార్థులకు తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు గుడ్‌ న్యూస్ చెప్పారు. తాండూరు ప్రాంత పదో తరగతి విద్యార్థుల (ఇంగ్లీష్ మీడియం)కు మ్యాథ్స్ సబ్జెక్టులో ఉచిత తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి విద్యార్థులు అత్యధికంగా మ్యాథ్స్‌లోనే ఫేయిల్ అయ్యారని తెలిపారు. ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకుని వచ్చే నెల 3 నుంచి ఇంగ్లీష్ మీడియం పదో తరగతి విద్యార్థులకు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనువభజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉచితంగా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల్లో విద్యార్థులు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆఫీసులో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 3 నుంచి 15 వ తేది వరకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇది కూడా చదవండి... కాళ్లకు కరెంటు చెప్పులు..! - అమ్మాయిల కోసం రూపకల్పన - ఆకతాయి వేషాలేస్తే అంతే సంగతులు - చెప్పుల ధర కూడా అందుబాటులోనే https://dharshininews.com/17455 chaithany collage