schedule Saturday, July 04, 2026

గ్రంథాలయల పురోగతిపై దృష్టి

calendar_today June 3, 2023
person dharshininews
గ్రంథాలయల పురోగతిపై దృష్టి
గ్రంథాలయల పురోగతిపై దృష్టి - లైబ్రరీలలో ఆదునిక వసతుల కల్పనకు కృషి - తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి - కోడంగల్‌లో శాఖా గ్రంథాలయం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రంథాలయాల పురోగతిపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలో శాఖ గ్రంథాలయం ప్రారంభోత్సవం జరిగింది. శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవానికి మంత్రి సబితారెడ్డి మహబూబ్ నగర్‌ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, కోడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా శాఖా గ్రంథాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రంథాలయాలను పట్టించుకోకపోవడంతో అవి నిర్వీర్యమైపోయాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రంథాలయాల అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేశారని అన్నారు. త్వరలోనే జిల్లాలో డిజిటల్‌ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దీంతో పాటు బడుల్లో రీడింగ్‌ రూమ్స్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ కోడంగల్‌లో రూ. 75 లక్షలతో గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే తాండూరులో కూడా రూ. 1.75 కోట్లతో లైబ్రరీ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17555 chaithany collage