schedule Monday, September 21, 2026

ప్రగతి బాటకే వీబీఓ వ్యవస్థ

calendar_today June 9, 2023
person dharshininews
ప్రగతి బాటకే వీబీఓ వ్యవస్థ
ప్రగతి బాటకే వీబీఓ వ్యవస్థ - సంస్థ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలి - తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ - తాండూరులో వీబీఓల నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీలో వీబీఓ(వీలేజ్ బస్ ఆఫీసర్)లతో సంస్థ ప్రగతి బాటలో నడుస్తాయని ఖాయమని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీధర్ లు అభిలాషించారు. శుక్రవారం తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమత ఆధ్వర్యంలో డీపోలో వీబీఓ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీధర్ లు అథిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు శాఖల మాదిరిగానే ఆర్టీసీలో వీబీఓల వ్యవస్థను తీసుకరావడం సంస్థకు శుభపరిణామం అని అన్నారు. వీబీఓలుగా నియామకం అయిన వారందరు గ్రామాల్లో ఆర్టీసీ సేవలను విస్తృత పరచాలన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా రీజినల్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రతి గడపకు చేర్చాలనే ఉద్దేశంతో ఎండీ, చైర్మన్ లు నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు వీబీఓలు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ డీపో మేనేజర్ సమత మాట్లాడుతూ తాండూరు డీపో పరిధిలోని 98 గ్రామాలకు గాను మొదటి విడతలో 25 మంది వీబీఓలను నియమించడం జరిగిందన్నారు. ఆర్టీసీలో ప్రవేశ పెట్టిన వీబీఓల సేవలను ప్రయాణికులు, ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వీబీఓలుగా నియామకం అయిన వారికి సంబంధించిన కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఐ నందలాల్, సాధిక్, వేల్పేర్ కమిటి సభ్యులు మోదీన్ సాబ్, సీఆర్పీసీ శేఖర్, వీబీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17728 chaithany collage