schedule Tuesday, September 22, 2026

భారత సంస్కృతుల్లో వ్యక్తిత్వ వికాసం

calendar_today June 10, 2023
person dharshininews
భారత సంస్కృతుల్లో వ్యక్తిత్వ వికాసం
భారత సంస్కృతుల్లో వ్యక్తిత్వ వికాసం - గీతా పఠనంపై అందరు ఆసక్తి పెంచుకోవాలి - గీతాపరివార్ హైదరాబాద్ సభ్యులు - తాండూరులో బాల సంస్కార శిబిరం ముగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతదేశ సంస్కృతుల ద్వారానే అందరిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని గీతా పరివార్ హైదరాబాద్ శాఖ ప్రతినిధులు అన్నారు. తాండూరు రాజస్థానీ మహిళ మండలి నేతృత్వంలో హైదరాబాద్ గీతా పరివార్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేది నుంచి పట్టణంలో 6 నుంచి 15 ఏండ్ల చిన్నారులకు బాల సంస్కార శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన గురూజీ అరవింద్ గోడ్ చిన్నారులకు గీతా పఠనం, యోగా, న్యూరోబిక్స్, దేశభక్తి గీతాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ బాల సంస్కార శిబిరంలో 60 మంది చిన్నారులు పై అంశాలపై శిక్షణ పొందారు. శనివారం బాల సంస్కార శిబిరం ముగింపు సమావేశం ఉత్సహాంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు శిబిరంలో అవగాహన పొందిన అంశాలపై ప్రదర్శన ఇచ్చి అబ్బుర పరిచారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతుల ద్వారానే అందరిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని అన్నారు. చిన్నారులతో పాటు అందరు వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి సంచాలుకులుగా కిరణ్‌ సార్డా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాని మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠి, కార్యదర్శి కిషోరి గర్రాని, బోర్డు కోశాధికారి శోభ సార్డా, విజయలక్ష్మీ సార్డా, రాజస్థాని ప్రగతి సమాజ్, రాజస్థానీ సవ యువక్ సంఘ్ అధ్యక్షులు మన్మోహన్ సార్డా, మార్వాడి యువమంచ్ అధ్యక్షులు, బ్రిజ్ మోహన్ బూబ్, రాజస్థాని ప్రగతి సమాజ్ ఉపాధ్యక్షులు నందకిషోర్ పర్తాని, ఆయా సంఘాల కార్యదర్శులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17760 chaithany collage