schedule Tuesday, September 22, 2026

రేపు జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన ప్రారంభం

calendar_today June 14, 2023
person dharshininews
రేపు జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన ప్రారంభం
రేపు జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన ప్రారంభం - హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి - వికారాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలోని నూతన భవనాన్ని రూ. 1కోటి 70లక్షలతో నిర్మించారు. రేపు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను జరుగుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తెలిపారు. గురువారం ఉదయం 9-30 గంటలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17881 chaithany collage