schedule Tuesday, September 22, 2026

గొల్ల వినీష ఉన్నతంగా ఎదగాలి

calendar_today June 15, 2023
person dharshininews
గొల్ల వినీష ఉన్నతంగా ఎదగాలి
గొల్ల వినీష ఉన్నతంగా ఎదగాలి - ఆమె భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తాం - సింధూ డిగ్రీ కాలేజీ యజమాన్యం - ఎడ్ సెట్ స్టేట్ ర్యాంకర్ కు సన్మానం తాండూరు, దర్శినిప్రతినిధి: ఎడ్ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గొల్ల వినీష ఉన్నతంగా ఎదగాలని, ఆమె భవిష్యత్తుకు తోడ్పాటు అందిస్తామని తాండూరు సింధూ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు వి.రంగారావు, ప్రిన్సిపల్ విజయదేవిలు అన్నారు. బీఈడీ ఎంట్రెన్స్ ఎడ్ సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన గొల్ల వినిష తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే తొలి ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆమె సోదరి శిరీష కూడా 109వ ర్యాంకు సాధించింది. దీనిని పురస్కరించుకుని గురువారం సింధు కళాశాలలో గొల్ల వినీషను వ్యవస్థాపకులు రంగారావు, ప్రిన్సిపల్ విజయదేవిలు సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్ల వినీష మరిన్ని ఉన్నత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆమె భవిష్యత్తుకు కళాశాల తరుపున అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునందన్ రెడ్డి, అధ్యాపకులు, వినీష తల్లిదండ్రులు, సోదరి తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17909 chaithany collage