schedule Tuesday, September 22, 2026

రాజ్‌ కుమార్‌ కృషిపై హర్షం

calendar_today July 8, 2023
person dharshininews
రాజ్‌ కుమార్‌ కృషిపై హర్షం
రాజ్‌ కుమార్‌ కృషిపై హర్షం - సన్మానించిన విద్యార్థుల తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల సమస్యల పరిష్కారంలో కందుకూరీ రాజ్ కుమార్ సేవలు అభినందనీయమని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్‌ను వారు సన్మానించారు. ఎందుకోసమంటే.. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంకు చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చేవెళ్ల మండలంలోని మడిమల గ్రామంలో కొనసాగుతోంది. అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాజ్ కుమార్‌ తెలుసుకున్నారు. అక్కడ కొనసాగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తిరిగి పెద్దెముల్ తీసుకవచ్చేందుకు కృషి చేశారు. దీంతో శనివారం పాఠశాల కమిటీ సభ్యులు రాజ్‌ కుమార్‌ను కలిసి సన్మానించారు. కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు దోమ రవి , బిచప్ప టీచర్ నరసింహులు, డాక్టర్ నరసింహులు, మ్యతరి రమేష్, నీరటి రమేష్ ,బాబు , నరసింహులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18408 chaithany collage