schedule Saturday, July 04, 2026

ఎన్నికల అధికారుల టీం రెడి..!

calendar_today July 14, 2023
person dharshininews
ఎన్నికల అధికారుల టీం రెడి..!
ఎన్నికల అధికారుల టీం రెడి..! - జిల్లాలో ఆర్వోల నియామకం - నాలుగు డివజన్‌ల అధికారులు ఎవరంటే..? - తాండూరు ఆర్వో నియామకంపై సస్పెన్స్‌ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పక్రియ వేగవంతం అయ్యింది. ఎన్నికల నిర్వహణ కోసం వికారాబాధ్ జిల్లాలో అధికారుల టీంను రెడీ చేశారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలైపోయింది. గత రెండు మూడు నెలలుగా ఓటరు నమోదు, జాబితా రూపకల్పన వంటి చర్యలపై అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల పరిశీలన కూడా చురుగ్గా జరుగుతోంది. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల అధికారులు జిల్లాకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్వో)లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వికారాబాద్‌ ఆర్వోగా అడిషనల్‌ కలెక్టర్ రాహుల్ శర్మను, పరిగి ఆర్వోగా వికారాబాద్‌ ఆర్డీఓ విజయ కుమారి, కోడంగల్‌ ఆర్వోగా అడిషనల్‌ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యా నాయక్‌లను నిమించారు. ప్రస్తుతం తాండూరుకు ఆర్డీఓ లేకపోవడంతో ఆ స్థానంలో ఆర్వోగా ఎవరిని నియమిస్తున్నారనేది సస్పెన్స్‌గా మిగిలింది. మరోవైపు ఎన్నికల కోసం సెక్టోరియల్‌ అధికారుల నియామకంపై కూడా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18520 chaithany collage