schedule Saturday, July 04, 2026

శభాష్ రాజన్నా..!

calendar_today July 20, 2023
person dharshininews
శభాష్ రాజన్నా..!
శభాష్ రాజన్నా..! - తాండూరు విశాల్ మార్ట్‌లో ఉద్యోగాలు - 45 మంది స్థానిక యువతకు అవకాశం - కందుకూరి రాజ్ కుమార్ కృషికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీ సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడే బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆదర్శంగా నిలిశారు. తాండూరులో ఏర్పాటు చేస్తున్న భారత దేశంలో అతిపెద్ద ఫ్యాషన్ హోమ్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ అండ్ కిరాణా హైపర్ విశాల్ మెగా మార్ట్ సంస్థలో స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించి శభాష్‌ అనిపించుకున్నారు. తాండూరు పట్టణంలోని 5 మల్లప్ప మడిగ వద్ద త్వరలోనే విశాల్‌ మార్ట్ మెగా షోరూం ప్రారంభించబోతున్నారు. ఈ విశాల్ మెగామార్ట్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కృషితో స్థానిక యువతీ, యువలకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇందులో ఉద్యోగాల కోసం 100కు పైగా దరఖాస్తులు చేసుకోగా కందుకూరి రాజ్ కుమార్ యజమాన్యంతో చర్చలు జరిపి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారు. విశాల్ మెగా మార్ట్ నియమించిన అవుట్ పోర్సింగ్ విధానంలో స్థానికులైన యువతీ, యువకులు ఉద్యోగాలు చేసుకునేలా శ్రద్ధ తీసుకున్నారు. ఇందుకు యజమాన్యం అంగీకరించడంతో స్థానికులకు విశాల్ మార్ట్ లో ఉద్యోగాలు పొందారు. మరోవైపు స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించిన యువతీ, యువకుల తల్లిదండ్రులు కందుకూరి రాజ్ కుమార్ కృషిని అభినందించి సన్మానించారు. అదేవిధంగా పట్టణ ప్రముఖులు, రాజకీయ నేతలు రాజ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18692 chaithany collage