schedule Saturday, July 04, 2026

తెలంగాణ టెట్‌ నోటిపికేషన్‌ విడుదల

calendar_today August 1, 2023
person dharshininews
తెలంగాణ టెట్‌ నోటిపికేషన్‌ విడుదల
తెలంగాణ టెట్‌ నోటిపికేషన్‌ విడుదల - వచ్చేనెలలో పరీక్ష, ఫలితాలు - రేపటి నుంచే దరఖాస్తులకు అవకాశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌ను విడుదలైంది. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి 2023-24 విద్యాసంవత్సరానికి టెట్‌ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ విధానాలను ప్రకటించింది. వచ్చే నెల సెప్టెంబర్‌ 15న పరీక్ష నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌ దరఖాస్తులను రేపటి నుంచి ప్రారంభించి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించేందుకు వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఫీజు చెల్లింపులకు కూడా ఆగస్టు 16వ తేదీనే చివరి తేదీగా ఖారారు చేసింది. అదేవిధంగా టెట్ పరీక్ష సెప్టెంబర్‌ 15వ తేదీన రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. మొదటి సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక టెట్‌ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 27వ తేదీన ప్రకటించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18949