schedule Saturday, July 04, 2026

తహసీల్దార్లకు బదిలీలు..!

calendar_today August 2, 2023
person dharshininews
తహసీల్దార్లకు బదిలీలు..!
తహసీల్దార్లకు బదిలీలు..! - తాండూరు తహసీల్దార్‌కు స్థానచలనం - కొత్త ఎమ్మార్వోగా కె.తారాసింగ్ నియామకం - పెద్దేముల్, యాలాల మండలాలకు కొత్త ఎమ్మార్వోలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్‌ జిల్లాలోని రెవెన్యూ శాఖలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టింది. జిల్లాలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను బదిలీ చేస్తూ స్థానచలనం కల్పించింది. ఇందులో భాగంగా తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడును కూడా బదిలీ చేసింది. గత కొన్నేండ్లుగా ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చిన్నప్పల నాయుడును షాబాద్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా కేతావత్ తారాసింగ్‌ను నియమించారు. రేపో, ఎల్లుండో తారాసింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, కోడంగల్ మండల తహాసీల్దార్‌లను బదిలీ చేశారు. పెద్దేముల్ మండల తహసీల్దార్‌గా కె. కిషన్, యాలాల మండల తహసీల్దార్‌గా పద్మావతీలను నియమించగా కోడంగల్ మండల తహసీల్దార్‌గా విజయ్ కుమార్‌ను నియమించారు. దీంతో పాటు దుద్యాల మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న డీ.గణేష్‌ను తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18988