schedule Saturday, July 04, 2026

చదువులకు చేయూతనిస్తాం..!

calendar_today August 5, 2023
person dharshininews
చదువులకు చేయూతనిస్తాం..!
చదువులకు చేయూతనిస్తాం..! - పేద విద్యార్థులకు ఎన్‌ఎస్పీ ట్రస్ట్ అండ - రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ - తాండూరులో వెయ్యి మందికిపైగా నోటు బుక్స్ పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద విద్యార్థుల చదువులకు చేయూతనందిస్తామని తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. శనివారం నూలి శుభప్రద్‌ పటేల్(ఎన్ఎస్పీ) చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్‌ శ్రీవాణి శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ శుభప్రద్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించడం శుభపరిణామం అన్నారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని విద్యారంగంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మరోవైపు గతంలో ప్రభుత్వ కళాశాలలో ఈవ్ టీజింగ్ సమస్యను పరిష్కరించినదుకు విద్యార్థులు శుభప్రద్ పటేల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాంజనేయులు, నాయకులు ముస్తఫా పటేల్, ఆబిద్ చావుస్, శుభప్రద్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, కుర్వ బాలు, శ్రీశైలం, బాలు గౌడ్, రాము గౌడ్, నరేష్ గౌడ్, సచిన్, విజయ్, చందు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19069