schedule Sunday, September 20, 2026

మహేంద్రుడికి ఇక మంచిరోజులే..!

calendar_today September 7, 2023
person dharshininews
మహేంద్రుడికి ఇక మంచిరోజులే..!
మహేంద్రుడికి ఇక మంచిరోజులే..! - అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ - కేటీఆర్‌తో భేటీ అయిన మంత్రి మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి ఇక మంచి రోజులు మొదలయ్యాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి కేటీఆర్‌తో గురువారం మంత్రి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహేందర్ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ లో సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ట సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు వేచి ఉన్నందుకు మహేందర్ రెడ్డి రెండో సారి మంత్రిగా అవకాశం దక్కిందన్నారు. ఇక మహేందర్ రెడ్డికి మంచిరోజులు వచ్చాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ మంత్రి మహేందర్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల మాజీ ఎం పీపీ. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20033/