ఆర్మీ డాగ్.. వీరమరణం..!
September 13, 2023
dharshininews
ఆర్మీ డాగ్.. వీరమరణం..!
- సైనికుడిని కాపాడి ప్రాణాలు వదిలిన జాగిలం
- విచారం వ్యక్తం చేసిన ఆర్మీ అధికారులు
దర్శిని డెస్క్ : భారత సైన్యానికి చెందిన ఆర్మీ డాగ్ వీరమరణం పొందింది. ఉగ్రదాడిలో సైనికున్ని కాపాడేందుకు ముందుకు దూకి పోరాడిన జాగిలి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ సంఘటనతో భారత సైనిక అధికారులు విచారం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమయంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్ చేపడుతోన్న బృందం కెంట్ అనే ఆరేళ్ల ఆర్మీ డాగ్‌ను తీసుకెళ్లింది. ‘ఆపరేషన్ సుజలిగాల’లో భాగంగా ఓ పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను ఫాలో అవుతోంది. కొద్ది దూరంలో వెంటనే ఉగ్రవాదులను పసిగట్టిన శునకం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య యుద్ద వాతారణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు భారీగా కాల్పుల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ చెందిన ఉగ్రవాదులు ఓ భారత సైనికుడిని చుట్టుముట్టారు. గమనించిన కెంట్ వెంటనే వారికి ఎదురుగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ చేస్తునండగా కెంట్ శునకం తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన మరో జవాన్ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు భారత సైన్యం ఓ పాక్ ఉగ్రవాదిని అంతం చేసింది.
https://twitter.com/LestWeForgetIN/status/1701622669660078112?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1701622669660078112%7Ctwgr%5E24fd03dca726706bff067eadf2d92cdeb3f5f3fe%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fnational%2F6-year-old-indian-army-dog-dies-protecting-soldier-during-encounter-in-jammu-and-kashmir-1063270.html
ఇది కూడా చదవండి...
https://dharshininews.com/20207/