schedule Saturday, July 04, 2026

ఉల్లాసంగా... ఉత్సహాంగా.. ఆత్మీయ సమ్మేళనం

calendar_today September 24, 2023
person dharshininews
ఉల్లాసంగా... ఉత్సహాంగా.. ఆత్మీయ సమ్మేళనం
ఉల్లాసంగా... ఉత్సహాంగా.. ఆత్మీయ సమ్మేళనం - మైమరిచి పోయిన పూర్వ విద్యార్థులు - సందడి చేసిన శిశుమందిర్ టెన్త్ బ్యాచ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక తరగతిలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళాన్ని ఉల్లాసంగా.. ఉత్సహాంగా జరుపుకున్నారు. దాదాపు 29 ఏండ్ల తరువాత ఒకే వేదికలో కలుసుకుని పాత జ్ఞాపకాల్లో మైమరిచిపోయారు. ఆదివారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హాల్లో స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు చెందిన 1994-95 పదోతరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. ఆ బ్యాచ్లుకు చెందిన విద్యార్థులందరు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి ఏర్పడింది. చాలా రోజుల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరి యోగక్షేమాలను ఒకరు తెలుసుకుని సంతోషపడ్డారు. అందరు వివిధ హోదాల్లో స్థిరపడడం పట్ల హర్షం వ్యక్తం చేసుకున్నారు. అదేవిధంగా చదువున్న కున్న రోజుల జ్ఞాపకాలను నెమరు వేసుకుని సంతోషంగా గడిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆడిపాడారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20550/