schedule Sunday, September 20, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!

calendar_today September 26, 2023
person dharshininews
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..!
ఇంటర్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్..! - బషీరాబాద్ జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు ఆహ్వానం - ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల విద్యార్థులకు ఇంటర్మీడియట్ అధికారులు శుభవార్త చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. బషీరాబాద్‌ మండల కేంద్రానికి ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో అడ్మిషన్లను కోరుతోంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) కోర్సుల నుంచి అడ్మిషన్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆసక్తిగలవారు బషీరాబాద్‌ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర స్కూల్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/20620/