schedule Saturday, September 19, 2026

పరవశించిన.. పీపుల్స్ కాలేజీ..!

calendar_today October 13, 2023
person dharshininews
పరవశించిన.. పీపుల్స్ కాలేజీ..!
పరవశించిన.. పీపుల్స్ కాలేజీ..! - ఉత్సహాంగా బతుకమ్మ సంబరాలు - ఆడిపాడిన కళాశాల విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణం పరవశించిపోయింది. శుక్రవారం కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా కళాశాల విద్యార్థులు అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయం ఉట్టేపడేలా బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్, ప్రిన్సిపల్ సత్యానంద్ కుమార్ లు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తోందన్నారు. పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మెంబర్లు ధారాసింగ్, జనార్ధన్ రెడ్డి, అద్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/21048/